ఖానాపూర్ మండలంలో మరోసారి అడవిపందులు బీభత్సం సృష్టించాయి. ఖానాపూర్ మండలం తర్లపాడ్ గ్రామానికి చెందిన పోలంపెళ్లి రాజేశ్వర్ అనే రైతు పంట చేల్లో గత రెండు రోజులుగా వరుసగా అడవిపందులు దాడి చేశాయి. మంగళవారం బాధిత రైతు మాట్లాడుతూ ఆరుగాలం శ్రమించి పండించిన మొక్కజొన్న పంటను తీవ్రంగా ధ్వంసం చేశాయన్నారు. పంట చేతికందిన తర్వాత అడవిపందులు నాశనం చేశాయని రైతు రాజేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.