అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ పరిధిలో గల రోలుగుంటలో జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటు చేయాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే.గోవిందరావు ఆదివారం నాడు డిమాండ్ చేశారు. 2022–23లో ఇంటింటికి కుళాయిల నిమిత్తం రూ.6కోట్లు నిధులు మంజూరు చేశారన్నారు. అప్పట్లో పనులు మొదటి పెట్టి నిలిపేశారన్నారు. గ్రామాన్ని ప్లోరైడ్ గ్రామంగా గుర్తించారని, అనేక మంది ఫ్లోరైడ్ బాధితులు ఉన్నారని తక్షణమే ఈ జలజీవన్ మిషన్ పనులు ప్రారంభించాలని కోరారు.