యాదాద్రి భువనగిరి జిల్లా, తుర్కపల్లి మండలం, వాసాలమర్రి కి చెందిన పర్వతం రాజు మూడు చింతలపల్లి మండలం కొలతూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శనివారం మధ్యాహ్నం స్థానికులు, పోలీసులో తెలిపిన వివరాల ప్రకారం.. వాసాలమర్రికి చెందిన పర్వతం రాజు (25) తన కంపెనీ పని నిమిత్తం పాసాలమర్రి నుండి యాడారం తుర్కపల్లి కి రోజు వెళ్తుంటాడు. ఈ క్రమంలో కొల్తూరు వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టడంతో రాజు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.