విశాఖ రైల్వే స్టేషన్లలో మాదకద్రవ్యాల ముఠాలకు చెక్, ఆరుగురు అరెస్ట్, 34 కేజీల గంజాయి స్వాధీనం విశాఖపట్నం జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకునే చర్యల్లో భాగంగా, జీఆర్పీ డీఎస్పీ రామచంద్ర రావు మార్గదర్శకత్వంలో జీఆర్‌పీ సిఐ ధనంజయనాయుడు నేతృత్వంలో సిబ్బందితో ప్రత్యేక నిఘా బృందాలతో మంగళవారం విశాఖపట్నం రైల్వే స్టేషన్ల పరిధిలో కీలకమైన తనిఖీలు నిర్వహించారు. ఈ దాడులలో గంజాయి స్మగ్లింగ్‌లో పాల్గొన్న ఆరుగురు ముద్దాయిలను అదుపులోకి తీసుకొని, మొత్తం 34 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.