ఎగువన కురిసిన భారీ వర్షాలకు యాదాద్రి భువనగిరి జిల్లా, భూధాన్ పోచంపల్లి మండలం, జూలూరు గ్రామంలోని లో లెవెల్ బ్రిడ్జి పై నుండి మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. శనివారం ఉదయం స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుండగా జూలూరు, రుద్రవెల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బ్యారిగేట్లు ఏర్పాటు చేసి వాహనాలకు అనుమతించడం లేదు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ హనుమంతరావు మూసి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.