రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో యూరియా కోసం రైతన్నలు సోమవారం ఉదయం భారీగా క్యూ కట్టారు. గత కొన్ని రోజులుగా యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నామని,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకొని రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని రైతన్నలు వేడుకుంటున్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలో పలు ఫర్టిలైజర్ షాప్ ల వద్ద రైతన్నలు గుమ్మిగుడి దర్శనమిస్తున్నారు. సోమవారం సాయంత్రం ఐదు యాభై నిమిషాలు కావస్తున్న యూరియా కోసం క్యూలైన్ లో రైతన్నలు కనిపిస్తున్నారు.