రాయదుర్గం మండలంలోని టి.వీరాపురం సమీపంలో భారీ వర్షాలు ఈదురు గాలులకు కారణంగా భారీ వృక్షాలు నేలకొరిగాయి. గురువారం ఉదయం రోడ్డు పక్కన ఉన్న షెడ్లపై పడటంతో కణేకల్లు - రాయదుర్గం వైపు రాకపోకలు నిలిచిపోయాయి. చెట్లుఉ విద్యుత్ తీగలపై పడటంతో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. దీంతో రాయదుర్గం పట్టణానికి తాగునీరు సరఫరా చేసే పంపింగ్ స్టేషన్ కు విద్యుత్ సరఫరా ఆగిపోయింది. రాయదుర్గం పట్టణానికి నీటిసరఫరా నిలిచిపోయింది. మరమత్తులు చేపట్టి నీటి పంపింగ్ ప్రారంభిస్తామని కమీషనర్ తెలిపారు. మరోవైపు రోడ్డుపై పడిన చెట్లను తొలగించేందుకు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు.