కూటమి ప్రభుత్వం బీసీలపై వివక్ష చూపుతోందని బీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ క్రాంతి కుమార్ ఆరోపించారు. గుంటూరులో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో బీసీలు తమ వెన్నెముక అని చెప్పి అధికారం లోకి వచ్చాక దాడులు, అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీసీలపై దాడులు, కేసులు ఎందుకు జరుగుతున్నాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే బీసీ కుల గణన చేపట్టాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేస్తామని హెచ్చరించారు..