తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆటో డ్రైవర్లు గురువారం మధ్యాహ్నం గజపతినగరం పట్టణంలోని నాలుగు రోడ్ల జంక్షన్లో మానవహార ప్రదర్శనతో పలు నినాదాలు చేశారు. కార్యక్రమాన్ని నాయకత్వం వహించిన ఏఐటీయూసీ జిల్లా నాయకులు పురం అప్పారావు మాట్లాడుతూ, ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు ఆటో డ్రైవర్ల జీవన భృతిగా 30,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఆటో డ్రైవర్లు కార్యక్రమానికి హాజరయ్యారు.