కామారెడ్డి పట్టణంలోని పురాతన కిష్టమ్మ గుడి ని సందర్శించిన శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి.ఆయన మాట్లాడుతూ పురాతన చరిత్ర కలిగిన కిష్టమ్మ గుడి లో నెలకొన్న సమస్యలు తెలుసుకొని ఆలయ అభివృద్ధి కొరకు కృషి చేస్తానని ఆలయ కమిటీ సభ్యులతో చర్చించడం జరిగింది. కామారెడ్డి పుర ప్రముఖుల అందరితో కలిసి పురాతన ఆలయానికి పూర్వ వైభవం వచ్చేలా కృషి చేస్తానని అన్నారు. అలాగే పట్టణంలో కొలువై ఉన్న శ్రీ కోడూరి హనుమాన్ ఆలయ పునర్నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించడం జరిగింది. సాధ్యమైనంత తొందరగా ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేసి ఆలయం వేడుకలు నిర్వహించేందుకు సిద్ధం కావాలని ఆలయ కమిటీ సభ్యులతో మాట్లాడారు.