మహారాష్ట్ర నుంచి కాగజ్ నగర్ కు కారులో అక్రమంగా తరలిస్తున్న 1,050 (90ML)మద్యం బాటిళ్లను ASF టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నట్లు ASF జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు.. మంగళవారం కాగజ్ నగర్ పట్టణంలో అక్రమ మద్యం తరలిస్తున్నారని పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు కారును తనిఖీ చేయగా అందులో అక్రమ మద్యం పట్టుబడింది. పట్టుకున్న మద్యం విలువ సుమారు రూ.63 వేలునుంటుందన్నారు. అక్రమ మద్యాన్ని కాగజ్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించి,ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.