శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని నాలుగో వార్డు నర్సింగ్ గాయపల్లిలో పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ పీజీ కళాశాలకు కోటి 20 లక్షల వ్యయంతో నిర్మించనున్న ప్రహరీ గోడ నిర్మాణానికి వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే మాట్లాడుతూ కళాశాలలోని సమస్యలను విడతలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు విద్యార్థులకు నాణ్యమైన విద్యా సదుపాయాలు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ మాజీ కౌన్సిలర్ కృష్ణ పరశురామ్ తదితరులు ఉన్నారు.