చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం చైర్లోపల్లి గ్రామంలో కాపురం ఉంటున్న కుమార్తె నిర్మలను చూసేందుకు ఆమె తండ్రి మదనపల్లె మండలం నీరుగట్టువారి పల్లి నుంచి ఆదివారం రాత్రి వచ్చి గ్రామంలో తప్పిపోయారు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల సమీప బంధువుల ఇండ్లల్లో గాలించిన ఫలితం లేకపోవడంతో సోమవారం పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై ఏ.ఎస్ఐ అశ్వత్ నారాయణ మగ వ్యక్తి అదృశ్యం కేసు నమోదు చేసినట్లు సోమవారం రాత్రి 9గంటలకు తెలిపారు