చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజక వర్గం.చౌడేపల్లి మండలం దిగువ పల్లిలో వెలసి ఉండు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయ ధర్మకర్తల మండలి ఏర్పాటుకు దేవాదాయ శాఖ నోటిఫికేషన్ విడుదల చేయడంతో. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో జనసేన పార్టీ పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జి చిన్నారాయల్, ధర్మకర్తల మండలి సభ్యునిగా ఆలయ కార్య నిర్వహణ అధికారి ఏకాంబరం,కు దరఖాస్తు చేసుకున్నారు. ఆయనతోపాటు 12 మంది పాలకమండలి సభ్యులుగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో సేవకుడిగా పని చేస్తానని అన్నారు.