శ్రీశైలం లో మరోసారి బయటపడిన భద్రతా వైఫల్యం బయటపడింది. శ్రీశైలం క్షేత్ర పరిధిలో మరోసారి డ్రోన్ కలకలం రేగింది. శ్రీశైలం మల్లికార్జున స్వామి గర్భాలయం పై డ్రోన్ చక్కర్లు కొట్టిన వైనం ఆలయం ప్రధాన గోపురం సమీపంలోని ఆకాశంలో డ్రోన్ కెమరాన్ గుర్తు తెలియని వ్యక్తులు ఎగరవేశారు. ఆకాశంలో డ్రోన్ ఎగురుతుండగా దేవస్థానం సెక్యూరిటీ చీప్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు అలర్టయ్యారు .తమ సిబ్బందితో అప్పటికప్పుడు డ్రోన్ ఎగురుతున్న ప్రదేశానికి హుటాహుటిన చేరుకున్నారు. అప్పటికే డ్రోన్ కెమెరా కనపడకపోవడంతో దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది విస్తృత తనిఖీలు చేపట్టారు.