తాడిమర్రి మండల కేంద్రంలో బుధవారం అర్వేడు పట్నం పెద్దయ్య స్వామి జల్ది పూజ కార్యక్రమం ఎల్లమ్మ సాగు మహోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ధర్మవరం టిడిపి ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ వేరువేరుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా నిర్వహించిన పంచామృత అభిషేకం అంకరార్పణ కళ్యాణోత్సవంలో మంత్రితోపాటు పలువురు ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ గురవయ్యల వేషధారణలో అభిమానులకు కనువిందు చేశాడు.