అప్పుతీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించకుండా, అడిగిన వ్యక్తిని చంపాలని చూసిన ఓ పాత నేరస్తుడిని మందమర్రి పోలీసులు బుదవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రాకారం మందమర్రి పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన ఎన్నం మొండి భార్య, సుమారు రెండు సంవత్సరాల క్రితం మరణించింది. ఆమె జీవించి ఉన్నప్పుడు అదే ప్రాంతానికి చెందిన దేవసాని నరేందర్‌కు కొంత డబ్బు అప్పుగా ఇవ్వగా బాకీ డబ్బులను తిరిగి ఇవ్వాలని, అడుగగా రాత్రి సమయంలో ఎన్నం మొండి ఇంట్లో నిద్రిస్తున్నప్పుడు, స్టీల్ పైపుతో అతనిపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.