గజ్వేల్ ప్రెస్ క్లబ్ పీపుల్స్ ప్రెస్ క్లబ్ అని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఆదివారం ప్రజ్ఞాపూర్ లోని ఎస్ఏల్ఏన్ కన్వెన్షన్ హాల్ లో గజ్వేల్ ప్రెస్ క్లబ్ రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు హాజరై మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ప్రజలను, అన్ని రాజకీయ పార్టీల నాయకులను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఉద్యమంలో కీలకపాత్ర పోషించే విధంగా కృషి చెయ్యడంలో గజ్వేల్ జర్నలిస్టుల పాత్ర మరువలేనిదని కొనియాడారు. రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో ధూంధాం పేరిట అన్ని రాజకీయ పార్టీల నాయకులను ఏకతాటిపైకి తీసుకువచ్చి ప్రతి ఒక్కరిచే జ