నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బస్సు ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఆగ్రాకు చెందిన సంతోష్(36) సాయి నగర్‌లో ఐదేళ్ల నుంచి జీవిస్తున్నాడు. సోమవారం కంఠేశ్వర్ నుంచి NTR చౌరస్తా వైపు బైక్‌పై వెళ్తుండగా స్కూల్ బస్సు సడన్ బ్రేక్ వేయండతో సంతోష్ వెళ్లి బస్సును ఢీకొన్నాడు. ఆ తరువాత వెనుక నుంచి వచ్చిన RTC బస్సు సంతోష్‌ను ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. 3వ టౌన్ ఎస్ఐ హరిబాబు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.