అనంతపురం జిల్లా వజ్రకరూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం( స్వస్తి) రాష్ట్ర బృందం సభ్యులు తనిఖీ చేశారు. స్వస్తి ప్రోగ్రామ్ స్టేట్ మేనేజర్ శివ కిషోర్, డాక్టర్ తన్మయిల బృందం స్థానిక పిహెచ్సి వైద్యాధికారి సర్దార్ వలి, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు పిహెచ్సి సిబ్బందితో వాతావరణ సంబంధిత ఆరోగ్య అవసరాలు మార్పుల వల్ల తలెత్తే సమస్యలపై సమీక్షించారు. గ్రామాల్లో వాతావరణ మార్పులతో వచ్చే వ్యాధుల పట్ల అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్ఈఓ గురు ప్రసాద్ సూపర్వైజర్ నాగ శంకర్ వైద్య సిబ్బంది పాల్గొన్న.