కామారెడ్డి : ఈనెల 09 తేదీ మంగళవారం ఉదయం 9:30 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో గ్రామ పాలన అధికారులకు కౌన్సిలింగ్ ద్వారా క్లస్టర్లను కేటాయించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. గతంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో వీఆర్వోలుగా, వీఆర్ఏలుగా పనిచేసే ప్రస్తుతం ఇతర శాఖలలో విధులు నిర్వహిస్తున్న వారిని ప్రత్యేక పరీక్ష ద్వారా రెవెన్యూ డిపార్ట్మెంట్ లోకి జిల్లాలో 363 మందిని గ్రామ పాలనాధికారులుగా తీసుకోవడం జరిగింది. వారికి రేపు మంగళవారం ఉదయం 9:30 గంటలకు జిల్లా కలెక్టర్ సమక్షంలో కలెక్టరేట్ లో కౌన్సిలింగ్ నిర్వహించి క్లస్టర్లను కేటాయించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.