పామూరు మండలంలోని మోపాడు రిజర్వాయర్ ను పామూరు ఏఎస్ఐ జిల్లాని, పోలీస్ సిబ్బందితో కలిసి బుధవారం పరిశీలించారు. పామూరు మండలంలోని గణేష్ విగ్రహాలు మోపాడు చెరువులో నిమజ్జోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో ఏఎస్ఐ జిలాని మోపాడు చెరువును పరిశీలించారు. పామూరు మండలంలోని గ్రామాల నుండి వచ్చే గణేష్ విగ్రహాలకు సీరియల్ నెంబర్లను కేటాయించి, ఆ నెంబర్ల ఆధారంగా వరుస క్రమంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ప్రశాంతంగా నిమజ్జోత్సవాలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఏఎస్ఐ జిలాని తెలిపారు.