మహబూబాబాద్ జిల్లా టిఆర్ఎస్ నేతలపై ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచందర్ నాయక్ మండిపడ్డారు.. సత్యవతి రాథోడ్ కు టిఆర్ఎస్ పార్టీ నాయకులే మర్యాద ఇవ్వరు అలాంటిది నువ్వేం మాట్లాడుతున్నావ్ అని ఎద్దేవా చేశారు.. ఆరు నెలలకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టడం కాదు ప్రజాక్షేత్రంలో ఉంటారో లేదో తెలుసుకోవాలన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే రెడ్డినాయక్ అనవసర ప్రకటనలతో మర్యాద పోగొట్టుకోవద్దని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు సురక్షితంగా ఉన్నారని తెలిపారు.