ధర్మవరం ఎమ్మెల్యే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ మరోసారి వైకాపా నాయకులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వైకాపా నాయకులను మంత్రి క్రీఫ్టో గ్యాంగ్ తో పోల్చారు. గత ఐదు సంవత్సరాలు పరదాల మాటున దోపిడీలు సాగించిన వైకాపా నాయకులు అభివృద్ధి సంక్షేమమే పాలనగా చేస్తున్న కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తోందని ఇటువంటి మారీచులను మాయ మచ్చింద్రాలను భూస్థాపితం చేయాలంటూ ఆవేశంగా మాట్లాడారు.