సిద్దిపేట జిల్లా కేంద్రంలో గిరిజన కళాశాల బాలుర వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి గురువారం ఆకస్మికంగా సందర్శించారు. వంట గదికి వెళ్ళి కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని, అన్నం కూరగాయల నాణ్యత ను చూస్తూ రుచికరంగా వండాలని నాణ్యమైన ఆహార పదార్థాలను మాత్రమే వాడాలని వంట సిబ్బందిని ఆదేశించారు. అలాగే వంట గది లోపల, డైనింగ్ హల్, బయట చుట్టు పరిసరాలు శుబ్రంగా ఉంచుకోవాలని బాలురకు సీజనల్ వ్యాధులు రాకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. స్టాక్ రిజిస్టర్, అటెండెన్స్ రిజిస్టర్ వెరిఫై చేశారు. విద్యార్థులకు బోజన వేళల్లో వార్డెన్ తప్పనిసరిగా మానిటర్ చెయ్యాలని వసతి గృహం లో విద్యార్థు