అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని తగ్గుపర్తి గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఎయిడ్స్ నియంత్రణ మాస్ ఎడ్యుకేషన్ సంస్థల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ మౌనిక గ్రామ పెద్దలు సచివాలయ ఉద్యోగులు స్థానిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులతో కలసి నిర్వహించారు. హెచ్ఐవి సుఖ వ్యాధులు క్షయ వ్యాధి డ్రగ్స్ మాదకద్రవ్యాల పైన ప్రజలకు అవగాహన కల్పించి యువత చెడు వ్యసనాల బారిన పడకుండా ఉండాలని సుఖ వ్యాధులు అతి ప్రమాదకరమని అవగాహన కరపత్రాలను ప్రజలకు అందిస్తూ అవగాహన ర్యాలీ నిర్వహించారు.