వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలోని చౌడేశ్వరి దేవి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన బండలాగుడు పోటీల కార్యక్రమానికి శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన హాజరై సీనియర్ విభాగానికి సంబంధించిన పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బండలాగుడు పోటీలతో వనపర్తి నియోజకవర్గంలోని పెబ్బేరు పట్టణ ప్రాముఖ్యత నలుమూలల వ్యాప్తి చెందుతుందని ఈ పోటీలు నిర్వహించిన రైతు సంఘం నిర్వాహకులందరికీ ఆయన అభినందనలు తెలియజేశారు