సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ - బీదర్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం జహీరాబాద్ పట్టణం నుండి బీదర్ వైపు వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా , మరో ఆరు మందిని 108 అంబులెన్స్ సిబ్బంది ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు పొందుతున్నారు.ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.