నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున బోర్గం పాంగ్ర వాగు నీళ్లు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో బ్యాంకు కాలనీ లో నాలా ప్రక్కన ఉన్న దాదాపు 15 కుటుంబాలు నివసిస్తున్న గుడిసెలోకి నీళ్లు రావడంతో వారు నిరాశ్రయులయ్యారు.విషయం తెలుసుకున్న CP సాయి చైతన్య ఆదేశాల మేరకు ఏసిపి రాజా వెంకటరెడ్డి, ఆధ్వర్యంలో నగర సిఐ శ్రీనివాస్ రాజు,4 టౌన్ ఎస్సై శ్రీకాంత్, ఉదయ్, పోలీస్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొన్నారు. శివాజీ సమితి, స్థానికుల సహాయంతో అక్కడి నుంచి కాలనీ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కలిపి దాదాపు 40 మంది కి ఆశయం కల్పించారు.