సనత్ నగర్ లోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం రాత్రి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఈనెల 27న అన్ని బోఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఈనెల 27 తో బిఆర్ఎస్ పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకుందన్నారు. పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం వరంగల్ లో నిర్వహించే రజతోత్సవ సభకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు హాజరుకావాలని కోరారు. గత పది ఏళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని కొనియాడారు.