యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణమని రాష్ట్ర మంత్రి వాకటి శ్రీహరి ఆరోపించారు. రాష్ట్రానికి సరిపడేంత యూరియా పంపకుండా కేంద్రం ద్రోహం చేస్తుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో ప్రధాని మోడీ కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నాడని ధ్వజమెత్తారు. నగరంలోని రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు.. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ హామీకి కట్టుబడిఉందన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి వాకటి శ్రీహరి అన్నారు.