సిరిసిల్ల పట్టణంలోని బస్ డిపో ఖాళీ స్థలం డంపింగ్ యార్డ్ గా మారి పాదాచారులకు భరించలేని దుర్వాసన, చుట్టుపక్కల గల ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మోసం రమేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా ఖాళీగా ఉన్న స్థలంలో చెత్త ,చెదారం, జంతువుల కళేబరాలతో నిండిపోయి ఉందని దీనివలన దుర్వాసన వెదజల్లుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పక్కనే ఉన్న బస్టాండ్ లో ప్రజలు ఈ దుర్వాసన వల్ల నిలబడే పరిస్థితి లేదని తెలిపారు. దోమలు, ఈగలు తయారై చుట్టుపక్కల నివసించే ప్రజలు తీవ్ర అనారోగ్య