గజపతినగరం కోర్టులో న్యాయమూర్తి ఏ విజయ రాజ్ కుమార్ శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో 577 కేసులు పరిష్కారం అయ్యాయి. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఏ విజయ్ రాజ్ కుమార్ మాట్లాడుతూ, కక్షిదారులు అదాలత్ ను సద్వినియోగం చేసుకోవడం ద్వారా డబ్బు,సమయం ఆదా చేసుకోవచ్చని, రాజీయే రాజమార్గమైన విషయాన్ని పక్షిదారులు గ్రహించాలన్నారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.