గోలేటి టౌన్షిప్ లోని సింగరేణి ఉన్నత పాఠశాలలో 71 వ అంతర్ జిల్లా సీనియర్ బాల్ బ్యాట్మెంటన్ ముగింపు పోటీలకు సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించి వారిని చెడు వ్యసనాల బారిన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉందని ఎమ్మెల్యే పాల్వాయి అన్నారు. పురుషుల టోర్నమెంట్ విజేతగా వరంగల్ టీం రన్నర్ ఆఫ్ టీం గా రంగారెడ్డి, మహిళ టోర్నమెంట్ విజేతగా అదిలాబాద్ రన్నర్ ఆఫ్ విజేతగా వరంగల్ టీంలు బహుమతులు అందుకున్నారు,