అనుమతులు లేకుండా విద్యుత్ స్తంభాలకు కట్టిన కేబుల్ వైర్లను తొలగించాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా వనస్థలిపురంలోని కరెంట్ పోల్స్పై కేబుల్ తీగలను కట్ చేస్తున్నారు. విద్యుత్ అధికారులు, సిబ్బంది పర్యవేక్షణలో రైతు బజారు-కమలానగర్-సుభద్రనగర్ రోడ్డులో తొలగింపు పనులు చేపట్టారు. ప్రమాదాలు జరగకుండా ఇలాంటి చర్యలు ఉపయోగపడతాయని స్థానికులు అంటున్నారు.