రాజన్న సిరిసిల్ల జిల్లా, గంభీరావుపేట మండలం, నర్మల వద్ద నీటి ప్రవాహంలో గల్లంతైన వ్యక్తి తేలుతూ తంగళ్ళపల్లి మండలం కస్బే కట్కూర్ చేరుకున్నదని సోషల్ మీడియా లో వస్తున్న ప్రచారం సరికాదని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానేరు నదికి అనుసంధానించబడిన అన్ని గ్రామాలను తాను, అధికారులు పరిశీలించామని పేర్కొన్నారు. అలాంటి మృద్దేహం ఎక్కడ కూడా కనిపించడం లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ఇలా ఇష్టం వచ్చినట్లు పోస్ట్ పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బయటకు ర