కృష్ణాజిల్లా వాసి పింగళి వెంకయ్య రూపొందించిన మువన్నెల జాతీయ పతాకం మన దేశానికి విశ్వ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిందని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఆర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్ కళాశాల ఎన్ ఎస్ ఎస్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం 2గంటల సమయంలో విశ్వవిద్యాలయంలో జాతీయ పతాకం రూపకర్త పింగళి వెంకయ్య 148వ జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపకులపతి విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు.