జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా తెలంగాణ క్రీడా శాఖ మంత్రి వాకిడి శ్రీహరి ఎల్బి స్టేడియంలో హాకీ మాంత్రికుడు ధ్యాన్ చాంద్ చిత్రపటానికి శుక్రవారం మధ్యాహ్నం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధ్యాన్చంద్ ఒలంపిక్స్ లో హాకీ క్రీడల్లో పలు గోల్స్ సాధించి దేశానికి వన్నెతెచ్చారని కొనియాడారు. యువకులు ధ్యాన్చంద్ ను ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి పాల్గొన్నారు.