యాదాద్రి భువనగిరి జిల్లా, మోట కొండూరు మండల కేంద్రంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆదివారం సాయంత్రం మంచినీటి శుద్ధీకరణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో మహిళలందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. మోట కొండూరు మండల కేంద్రంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు మంచినీటి శుద్ధికరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. తొలుత ఆయనకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అఖిలపక్ష నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.