మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి చెప్పిన అబద్ధం చెప్పకుండా నవ్విపోతురు గాక నాకేంటి సిగ్గు అన్నట్లు అబద్ధాలు చెప్పారని టిడిపి పులివెందుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విమర్శలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో రైతులు అనేక కష్టాలు పడుతున్నారని మాట్లాడారని చెప్పారు. పులివెందులలో జగన్ కుటుంబ సభ్యులు చేసిన నిర్వాకం ఎలాంటిదో, ఎందుకు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారో ఆలోచించకుండా తమపై అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. జగన్ ప్రభుత్వ హయాంలో లక్ష రూపాయల వరకు చీని ధరలు అమ్మినట్లు జగన్ పేర్కొన్నారని చెప్పారు.