సెట్టూరు మండలం లింగ దీర్లపల్లి గ్రామ సమీపంలో రోడ్డుకు అడ్డంగా కుక్క రావడంతో బైక్ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో జనసేన పార్టీ కార్యకర్త తిప్పే స్వామి తీవ్రంగా గాయపడ్డాడు. లింగ దీర్లపల్లి కి చెందిన తిప్పేస్వామి బైక్లో కళ్యాణదుర్గం వెళుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో గాయపడిన తిప్పేస్వామి స్థానికులు కళ్యాణ దుర్గం ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న జనసేన జిల్లా కార్యదర్శి లక్ష్మీనరసయ్య, సీనియర్ నాయకులు గంగరాజు, రమేష్, జాకీర్, రాజు తదితరులు శుక్రవారం కళ్యాణ దుర్గం ఆసుపత్రికి వెళ్లి తిప్పే స్వామిని పరామర్శించారు.