పోలవరం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు, గిరిజనులకు ప్రత్యామ్నాయ భూములివ్వాల్సిందేనని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారు. శనివారం రాత్రి అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరులోని కలెక్టరేట్ నుండి రంపచోడవరం, చింతూరు డివిజన్ అధికారులు, తాహశీల్దారులు, పోలవరం పరిపాలనాధికారులతో వీసీ నిర్వహంచారు. భూ సేకరణ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలన్నారు. పునరావాస కాలనీలకు ప్రజలను తరలించడానికి చర్యలు చేపట్టాలని సూచించారు.