మందమర్రి పట్టణంలో ఈనెల 31వ తేదీన తెలంగాణ రాష్ట్ర స్థాయి కుంగ్ ఫు, కరాటే ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు హరికృష్ణ ప్రధాన కార్యదర్శి కుందేళ్ళ రవి తెలిపారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం మందమర్రి పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కుంఫు కరాటే పోటీలకు ప్రాచుర్యం పెంపొందించడానికి తెలంగాణ రాష్ట్ర స్థాయి కరాటే పోటీలను ఈ నెల 31న ఆదివారం మందమర్రి పట్టణంలోని కమ్యూనిటీ హాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలకు రాష్ట్ర 33 జిల్లాల నుంచి సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొననున్నారని తెలిపారు.