స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం రేపల్లె పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో ఆర్డిఓ రామలక్ష్మి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వరదలు, సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నీరు నిల్వ ఉండే ప్రదేశాలలో దోమలు వృద్ధి చెందుతాయని, అటువంటి ప్రాంతాలలో ఆయిల్ బాల్స్ వేయాలని తెలిపారు. వరదలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చిన్న పిల్లలు నీళ్లలోకి దిగవద్దని ఆమె ఆదేశించారు.