ఎమ్మిగనూరు: గొర్రెల మందపై దూసుకెళ్లిన టిప్పర్..ఎమ్మిగనూరు మండలం బోడబండ సమీపంలో గొర్రెల మందపై టిప్పర్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో 6 గొర్రెలు మృతి చెందినట్లు కాపరులు తెలిపారు. టిప్పర్ వేగం అదుపు చేయలేక రోడ్డు పక్కన వెళ్తున్న గొర్రెల మందపైకి దూసుకెళ్లిందన్నారు.