హిమాయత్ నగర్ తహసిల్దార్ కార్యాలయంలో అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలకు సంబంధించిన చెక్కులను ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మంగళవారం మధ్యాహ్నం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 కల్యాణ లక్ష్మి నాలుగు షాది ముబారక్ పథకాలకు సంబంధించిన చెక్కులను పంపిణీ చేసినట్లు అన్నారు. పేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.