సంతనూతలపాడు మండలం మైనంపాడు ప్రభుత్వ డైట్ కళాశాలలో కళా ఉత్సవ్ 2025 జిల్లా స్థాయి పోటీలు సెప్టెంబర్ 11, 12 తేదీల్లో జరగనున్నట్లు ప్రిన్సిపాల్ సామా సుబ్బారావు తెలిపారు. మంగళవారం డైట్ కళాశాలలో ఆయన మాట్లాడుతూ. రెండు రోజులపాటు జరిగే కళా ఉత్సవ్ పోటీలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో 9 నుంచి 12వ తరగతి విద్యార్థులు కళా ఉత్సవ్ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులన్నారు విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు