అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ పరిధిలోగల బుచ్చయ్యపేట మండలం వడ్డాది జడ్పీ హైస్కూల్లో అనధికార వ్యక్తి విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై డిప్యూటీ డిఈఓ అప్పారావు విచారణ చేశారు. బుధవారం హైస్కూల్కి వచ్చి విద్యార్థినులు, ఉపాధ్యాయులు, హెచ్ఎం ప్రసన్న కళ నుంచి వివరాలు సేకరించారు. వారి నుంచి రాతపూర్వకంగా సమాచారం తీసుకున్నారు. అన్ని విషయాలను పరిశీలించి డిఈఓకి, ఆర్.జె.డి.కి నివేదిక సమర్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో బుద్ధ కాశీ విశ్వేశ్వరరావు పాల్గొన్నారు.