వెలిగండ్ల: కుటుంబ సాధికార కమిటీ సభ్యులుగా నియమితులైన వారు అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడవలసిన బాధ్యత ఉందని కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి అన్నారు. వెలిగండ్లలో శనివారం కుటుంబ సాధికార కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇంకా అర్హత ఉండి కూడా సంక్షేమ పథకాలు అందని వారు ఉంటే వారిని గుర్తించి వారికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడవలసిన బాధ్యత మనపై ఉందని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.