అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని శ్రీ గౌరసంద్రం మారెమ్మ దేవత ఆలయంలో మంగళవారం అమ్మవారి వార్షిక ఉత్సవంలో విశేష పూజలను భక్తులు ఘనంగా నిర్వహించారు. పూజల్లో భాగంగా ధ్వజారోహణం, అభిషేకాలు, అష్టోత్తర శతనామార్చన, ఒడి బియ్యం సమర్పణ పూజ, అమ్మవారి ఉత్సవ విగ్రహంతో గ్రామోత్సవం, అన్న ప్రసాద వితరణ, సామూహిక కుంకుమార్చన భజన కార్యక్రమాలను వార్షిక పూజోత్సవంలో భాగంగా సేవ కమిటీ సభ్యులు భక్తులు నిర్వహించారు.